Tuesday, March 11, 2008

KAVITA

O! delicious of Nature,beauticious ,
I adress thee!!
You provide me some lonely moments
right considered, worthy too.
I lend you
that unique credit,
For I harvest in witnessing You.
Ancient bulk I .. peace precious.
....One of the intricate works of Sri P. Goqri Bhavan.
I really admired by this and render my work with the literature apatites.

The Elements of the internal and external secienes lie with in us. These are the feelings of mine.

నా ప్రియ కవిత
సహస్ర దళములు దేవతలై
సతతము కొలిచే శార్వాణీ
మణిద్వీపము లో నడయాడే
మణిమయ శోభిత మాతంగీ
ఏమని ఏమని ఏమని పొగడుదు దేవీరూపవిలాసాలు
చివురుల బోలిన ఆ చరణాలు
బాలభానుని కిరణాలు
పాదాలంటిన లత్తుక తళుకులు
పడమట వాకిట కుంకుమలు
ఘల్లుఘల్లు మని మ్రోగే అందెల
సవ్వడులైనవి స్వరజతులు
ఏమని ఏమని ఏమని పొగడుదు దేవీరూపవిలాసాలు
తామర పూవుల కోమల దేహపు
కరముల కడియపు గలగలలు
గరళకంఠుని ఎదలో మ్రోగెను
కోటి వీణల సరిగమలు
ఏమని ఏమని ఏమని పొగడుదు దేవీరూపవిలాసాలు
రాకేందు వదనము రాజీవ లోచనము
కోటి సూర్య ప్రభల తేజమా ఫాలము
చెక్కిళ్ళ ధగధగ లే ఇరు సంధ్య అరుణిమలు
చక్కన్ని ముక్కెర కు సప్తవర్ణాలు
ఏమని ఏమని ఏమని పొగడుదు దేవీరూపవిలాసాలు
భ్రమరాలవలె ఒప్పు అలివేణి కురులు
వేవేల తారకలే సిగలోని విరులు
అరవిరియు వెన్నెలలే ఆతల్లి నవ్వులు
అఖిలాండ నాయకి ఆనంద రూపాలు
ఏమని ఏమని ఏమని పొగడుదు దేవీరూపవిలాసాలు